E.G: వుడ్ బ్యాంక్ కింద మొక్కల కొనుగోలు కోసం పంచాయతీరాజ్, అటవీ శాఖల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో పీసీసీఎఫ్ చలపతి రావు, పీ ఆర్ ఆర్డీ కమిషనర్ కృష్ణతేజ ఒప్పంద పత్రాలపై మంగళవారం సంతకాలు చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో పంచాయతీరాజ్ శాఖ రూ.10 కోట్లు అందిస్తుండగా, అందుకు బదులుగా అటవీ శాఖ త్వరగా కలపనిచ్చే మొక్కలను సరఫరా చేయనుంది.