NTR: కృష్ణా యూనివర్శిటీ(KRU) పరిధిలోని కళాశాలల్లో డిగ్రీ విద్యార్థులు రాయాల్సిన వన్ టైం ఆపర్చునిటీ సెకండియర్ మూడో సెమిస్టర్ పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. జూన్ 8-20 మధ్య నిర్ణీత తేదీలలో ఈ పరీక్షలను ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు 50, 75 మార్కులకు నిర్వహిస్తామని అధ్యాపకులు తెలిపారు. టైం టేబుల్ వివరాలకు https://kru.ac.in/ వెబ్సైట్ చూడాలని కోరారు.