ATP: మొబైల్ ఫోన్లో యాప్ డౌన్లోడ్ చేసుకోవడంతో అకౌంటెంట్ ఖాతా నుంచి రూ.1,42,800 మాయమైనట్లు డి.హీరేహాళ్ ఎస్సై గురుప్రసాదొడ్డి తెలిపారు. కర్ణాటక బళ్లారికి చెందిన షంషద్ ఆలీ స్థానిక స్పాంజ్ ఐరన్ కర్మాగారంలో పనిచేస్తున్నారు. ఈనెల 22న వచ్చిన ఏపీకే యాప్ డౌన్లోడ్ చేయడంతో ఫోన్ హ్యాక్ అయింది. నగదు విత్డ్రా కావడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించారు.