KMR: మద్నూర్ మండలం రుసేగాం గేటు వద్ద జాతీయ రహదారిపై లారీ బోల్తా పడింది. రోడ్డుకు అడ్డంగా పడటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జాతీయ రహదారి నిర్వహణ సిబ్బంది, పోలీసులు చేరుకొని లారీని ప్రొక్లెయిన్ సాయంతో తొలగించారు. అధికారులు సకాలంలో స్పందించడంపై ప్రయాణికులు హర్షం వ్యక్తం చేశారు. కాగా తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు.