NTR: టీడీపీ మహానాడు వేడుకను నేటి నుంచి 2 రోజులపాటు వర్చువల్‌గా ఆ పార్టీ అధిష్టానం నిర్వహించనుంది. మహానాడు సందర్భంగా విజయవాడలోని సీతమ్మ వారి పాదాల వద్ద రూ.18 లక్షల వ్యయంతో నిర్మించిన 150 అడుగుల భారీ కటౌట్‌ను మాజీ MLC బుద్దా వెంకన్న ఆవిష్కరించారు. మహానాడులో కీలక అంశాలపై చర్చించి తీర్మానాలు చేపట్టడం జరుగుతుందని వెంకన్న పేర్కొన్నారు.