MDCL: శామీర్‌పేటలో ఎమ్మార్వో సుచరిత లంచం తీసుకుంటూ ACB అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కారు. అలియాబాద్‌లో 30 ఎకరాల భూమి కన్వర్షన్‌కు ఎకరానికి రూ.1 లక్ష చొప్పున మొత్తం రూ.30 లక్షలు డిమాండ్ చేసినట్లు సమాచారం. రైతులు తొలి విడతగా రూ.2 లక్షలు ఆమె సూచన మేరకు డ్రైవర్‌కు ఇస్తుండగా ACB అధికారులు పట్టుకున్నారు.