ADB: ఉట్నూర్ కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాన్ని, గుడిహత్నూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఐటీడీఏ పీవో మంద మకరందు మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. ఆసుపత్రుల్లో రోగులకు అందుతున్న వైద్య సేవలు, సిబ్బంది పనితీరు, అందుబాటులో ఉన్న సౌకర్యాలపై ఆయన సమగ్రంగా పరిశీలించారు. ఆసుపత్రిలో వోపీ నమోదు వివరాలు, మందుల నిల్వలు, వైద్య సిబ్బంది హాజరు అడిగి తెలుసుకున్నారుజ