ATP: టీడీపీ కేంద్ర కార్యాలయంలో మహానాడు వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ.. మహానాడు తెలుగుదేశం పార్టీ పండుగని కొనియాడారు. సాంకేతికతను జోడించి రాష్ట్రవ్యాప్తంగా హైబ్రిడ్ విధానంలో ఈ మహానాడును నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. టీడీపీ క్రమశిక్షణ గల పార్టీ అని తెలిపారు.