GNTR: మందడం గ్రామంలో మంగళవారం ఏపీసీఆర్డీఏ గ్రామసభ జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ వి. విజయరామరాజు మాట్లాడుతూ, రాజధానిలో మౌలిక వసతుల పనులు వేగంగా సాగుతున్నాయని, రైతులు సహకరించాలని కోరారు. భూసమీకరణకు రైతులకు ఇంకా అవకాశం ఉందన్నారు. రిటర్నబుల్ ప్లాట్లు పొందిన వారు త్వరగా రిజిస్ట్రేషన్లు పూర్తి చేసుకోవాలని అధికారులు సూచించారు.