BDK: కొత్తగూడెం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలోని ప్యాలియేటివ్ కేర్ సెంటర్ ను మంగళవారం DMHO తుకారం రాథోడ్ తనిఖీ చేశారు. మార్ఫిన్ ఇంజెక్షన్ల లభ్యత, కొనుగోలు ప్రక్రియను పరిశీలించడంతో పాటు, చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడారు. హాజరు రిజిస్టర్ను పరిశీలించిన ఆయన, నిర్వహణలో గమనించిన లోపాలపై మెడికల్ ఆఫీసర్ డా.రూపతో సమీక్ష నిర్వహించారు.