JGL: మెట్పల్లి పట్టణానికి చెందిన మద్దికుంట గాయత్రి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఏలేటి ముత్తయ్య రెడ్డి తెలిపారు. వచ్చేనెల 7న హైదరాబాదులో జరిగే రాష్ట్రస్థాయి రన్నింగ్ పోటీల్లో ఆమె పాల్గొంటారని చెప్పారు. రాష్ట్రస్థాయికి ఎంపికైన ఆమెను మున్సిపల్ ఛైర్మన్ మైలారపు లింబాద్రి శాలువాతో సత్కరించారు.