పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగాల ‘స్పిరిట్’ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూట్ హైదరాబాద్లోని చారిత్రాత్మక కోఠి ఉమెన్స్ కాలేజీ (చాకలి ఐలమ్మ తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం) ప్రాంగణంలో జరుగుతోంది. ఈ తాజా షెడ్యూల్లో భాగంగా హీరో ప్రభాస్, హీరోయిన్ త్రిప్తి డిమ్రిల మధ్య వచ్చే కొన్ని కీలకమైన టాకీ పోర్షన్స్ ఇక్కడ చిత్రీకరిస్తున్నారు.