BPT: రేపల్లె సమన్వయకర్త పీటా నాగమోహన్ కృష్ణ ఆధ్వర్యంలో మత్స్యకారులు మంగళవారం వైఎస్ జగన్ను కలిశారు. తమకు మత్స్యకార భరోసా అందడం లేదని వారు జగన్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై జగన్ స్పందిస్తూ.. రాబోయేది మన ప్రభుత్వమేనని, వైసీపీ శ్రేణులను వేధించిన వారిని వదిలే ప్రసక్తే లేదన్నారు. అలాంటి వారి వివరాలను డిజిటల్ బుక్లో నమోదు చేయాలని పార్టీ నేతలకు సూచించారు.