కోనసీమ: అమలాపురం ఎంపీ గంటి హరీష్ బాలయోగి న్యూఢిల్లీలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను మంగళవారం కలిశారు. కోనసీమ ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న కోటిపల్లి–నరసాపూర్ రైల్వే ప్రాజెక్టును త్వరితగతిన పూర్తిచేయాలని కోరారు. ఈ సమావేశంతో ప్రాజెక్టుకు కొత్త ఊపు వచ్చిందని, త్వరలో పనులు వేగం పుంజుకుంటాయని ఎంపీ హరీష్ బాలయోగి తెలిపారు.