PLD: నరసరావుపేటలో ఎండల తీవ్రత విపరీతంగా పెరగడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు ఆదేశాలతో మున్సిపల్ సిబ్బంది రంగంలోకి దిగారు. పట్టణంలోని ప్రధాన రహదారులపై నీటి ట్యాంకర్ల సహాయంతో నీటిని చల్లుతున్నారు. దీనివల్ల రోడ్ల వేడి తగ్గడంతో పాటు దుమ్ము కూడా అదుపులోకి వస్తుందని అధికారులు పేర్కొన్నారు.