TG: BRS సభ్యత్వ నమోదును భారీగా చేపట్టి పార్టీని పటిష్టం చేయాలని మాజీ మంత్రి సబితా రెడ్డి పిలుపునిచ్చారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా రైతులకు తీరని అన్యాయం చేసిందని, ప్రజల్లో నమ్మకం కోల్పోయిందని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో BRS విజయం సాధిస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు.