JGL: చేయూత పెన్షన్ల ఆధార్ ఫేస్ అథెంటికేషన్ ప్రక్రియను మంగళవారం మున్సిపల్ ఛైర్పర్సన్ సమీండ్ల వాణి పరిశీలించారు. వృద్ధులు, దివ్యాంగులు గంటల తరబడి వేచి ఉండటం, సాంకేతిక సమస్యలతో ప్రక్రియ ఆలస్యం కావడంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. లబ్ధిదారులకు ఇబ్బంది కలగకుండా వెంటనే అదనపు సిబ్బందిని ఏర్పాటు పూర్తి చేయాలన్నారు.