AKP: ఎస్ రాయవరం మండలం రేవుపోలవరంలో క్రీడాకారులకు ముసలమ్మ చారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో క్రీడా సామగ్రిని మంగళవారం అందజేశారు. ట్రస్ట్ వ్యవస్థాపకులు బంగారు చిట్టి మాట్లాడుతూ.. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు వాలీబాల్, నెట్, ఫుట్ బాల్, త్రో బాల్ తదితర సామగ్రిని అందించామన్నారు. క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయన్నారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు.