TG: పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును రెండున్నరేళ్లలో పూర్తి చేస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఆయన ఈ రోజు రిజర్వాయర్లు, పంప్‌హౌస్‌లను పరిశీలించి, అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రాజెక్టుకు రూ.80 వేల కోట్లు అవసరమని, గత ప్రభుత్వం కేవలం ఎన్నికల లబ్ధి కోసమే ఒక పంప్‌ను ప్రారంభించిందని విమర్శించారు.