WGL: ఏకాదశి సందర్భంగా బుధవారం వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయంలో భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజామున పంచామృతాలతో అభిషేకం జరిపి, అనంతరం అమ్మవారిని నూతన పట్టు వస్త్రాలు, ఆభరణాలతో లక్ష్మీ స్వరూపంగా అలంకరించారు. నగరం సహా సుదూర ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలిరావడంతో ఆలయం భక్తులతో కిటకిటలాడింది.