NZB: బోధన్ పట్టణంలోని శ్రీ చక్రేశ్వర్ శివ మందిరానికి ఈ నెల 28న బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు ఈవో తెలిపారు. ఉదయం 11 గంటలకు దేవస్థాన కార్యాలయంలో పూజా సామాగ్రి, కిరాణా దుకాణం రెండేళ్ల లీజు లైసెన్స్ కోసం ఆసక్తి గల వారు డిపాజిట్ చెల్లించి వేలంలో పాల్గొనాలని సూచించారు. వేలం షరతులను వేలం రోజు వెల్లడించనున్నట్లు పేర్కొన్నారు.