JN: లింగాలఘాణపురం మండలం కళ్లెం గ్రామానికి చెందిన మబ్బు కరుణాకర్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పట్టా సాధించారు. ఉన్నత విద్యపై ఆకాంక్షలు, వైఖరి, ప్రభావాలపై పరిశోధన చేసి ఈ ఘనత అందుకున్నారు. పేద కుటుంబం నుంచి ఎదిగి తెలంగాణ విద్యార్థి ఉద్యమంలో చురుకుగా పనిచేసిన కరుణాకర్ విజయంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు.