VSP: వాల్తేరు రైల్వే డీఆర్ఎం లలిత్ బోహ్రా, రాయగడ డీఆర్ఎం అమితాబ్ సింఘాల్‌తో కలిసి మంగళవారం రాయగడ తాత్కాలిక కంట్రోల్ కార్యాలయాన్ని సమగ్రంగా పరిశీలించారు. ఆపరేషన్స్, ఇంజినీరింగ్, సేఫ్టీ తదితర విభాగాల ఏర్పాట్లను సమీక్షించి, సిబ్బందితో మాట్లాడారు. అంతకుముందు డీఆర్ఎం లలిత్ బోహ్రా విశాఖ నుంచి విజయనగరం వరకు విండో ట్రైలింగ్ తనిఖీ చేపట్టారు.