NDL: టీడీపీ వ్యవస్థాపక స్వర్గీయ ఎన్టీఆర్ నిర్వాసితులకు ఇచ్చిన జీవో.98 అమలు చేయాలని బాధితులు డిమాండ్ చేశారు. మంగళవారం నంది కొట్కూరు పట్టణంలో నిర్వాసితులు చేపట్టిన దీక్షలు 62వ రోజుకు చేరాయి. ఈ నేల 27, 28న జరిగే మహానాడులో జీఓ.98 పెట్టి తీర్మానం చేసి, నిర్వాసిత కుటుంబాలను ఆదుకునపుడే నిజమైన మహానాడు అన్నారు. ఈ దీక్షలలో బాధితులు పాల్గొన్నారు.