కోనసీమ: రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ అధికారిగా జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఉపసంచాలకులు పి.జ్యోతిలక్ష్మీ దేవిని ఎంపిక చేసింది. జిల్లాలోని సంక్షేమ వసతి గృహాలు విద్యార్థులు సాధించిన ఉత్తమ ఫలితాలకు గుర్తింపుగా ఈ అవార్డు దక్కింది. ఈ సందర్భంగా మంగళవారం సాంఘిక సంక్షేమ శాఖ సిబ్బంది, ఇతర అధికారులు ఆమెను కలిసి అభినందనలు తెలిపారు.