BDK: అశ్వారావుపేటలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఇవాళ విస్తృతంగా పర్యటించి, ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు గిరిజనుల సమగ్రాభివృద్ధికి బాటలు వేసే పలు సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం మద్దులమడలో ప్రజా రచ్చబండలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రజల మధ్య కూర్చొని వారి సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీఓ బి.రాహుల్ పాల్గొన్నారు.