WG: పెన్నాడలో డెంగ్యూ, మలేరియా వ్యాధులపై వైద్య సిబ్బంది మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎంపీహెచ్ఈఓ ప్రభాకరరావు మాట్లాడుతూ.. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా దోమల బెడదను, విష జ్వరాలను అరికట్టవచ్చన్నారు. తడి, పొడి చెత్తను వేరుచేసి పారిశుద్ధ్య కార్మికులకు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.