MDCL: బాల్య వివాహాలు బాలల భవిష్యత్తును దెబ్బతీసే సామాజిక సమస్య అని ఎస్‌సిపీసీఆర్ కమిషన్ సభ్యులు చందన అన్నారు. అల్వాల్ సర్కిల్ కార్యాలయంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. వీటివల్ల బాలికల విద్య, ఆరోగ్యం, మానసిక అభివృద్ధిపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. ఎక్కడైనా బాల్య వివాహాలు జరిగితే వెంటనే 1098 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు.