AP: ఆఫ్రికా దేశాల్లో ‘ఎబోలా’ వైరస్ కేసులు పెరుగుతున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. విజయవాడ ఎయిర్‌పోర్టులో ప్రయాణికులకు ఎబోలా వైరస్ స్క్రీనింగ్ పరీక్షలను నిర్వహిస్తోంది. విదేశీ ప్రయాణికులను నిశితంగా పరిశీలిస్తోంది. ఒకవేళ ఎవరిలోనైనా ఎబోలా వైరస్ లక్షణాలను గుర్తిస్తే, వారిని తక్షణం క్వారంటైన్‌కు తరలించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.