SKLM: స్వచ్ఛ గ్రామాల నిర్మాణమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. స్వర్ణాంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా మంగళవారం మెలియాపుట్టి ఎంపీడీవో కార్యాలయంలో 37 గ్రామ పంచాయతీలకు చెత్త సేకరణ ట్రై సైకిళ్లను పంపిణీ చేశారు. గ్రామాల్లో ఇంటింటికీ చెత్త సేకరణ వ్యవస్థను బలోపేతం చేసి పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు.