జగిత్యాల మున్సిపాలిటీలో హరితహారం ఎన్విరాన్మెంట్ ఇంజినీర్, ఇంఛార్జ్ శానిటరీ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న జింక శ్రీకాంత్‌పై మంగళవారం AITUC నాయకుడు వెన్నె మహేశ్ అదనపు కలెక్టర్ రాజగౌడ్‌కు ఫిర్యాదు చేశారు. కార్మికులతో అసభ్యంగా ప్రవర్తించడం, బెదిరింపులకు పాల్పడడం, డబ్బులు వసూలు చేస్తున్నారని, హాజరు విషయంలో వివక్ష చూపుతూ మానసికంగా వేధస్తున్నరన్నారు.