MLG: రాబోయే గోదావరి పుష్కరాలకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సమగ్రఏర్పాట్లు చేస్తున్నామని దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు తెలిపారు. మంగళవారం కాళేశ్వరం సమావేశంలో మాట్లాడుతూ.. పుష్కరాల నిర్వహణకు సుమారు రూ.1000 కోట్ల నిధులు సిద్ధంగా ఉన్నాయనిచెప్పారు. పారిశుధ్యం, త్రాగునీరు, భద్రత, ట్రాఫిక్, వైద్యసేవలపై ముందస్తు కార్యాచరణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు.