కడప ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం ఈఆర్వోలు, బీఎల్ఓల నియామకం, శిక్షణ, ఫారమ్‌ల పంపిణీ, పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ వంటి చర్యలను సమర్థవంతంగా చేపట్టాలని సూచించారు.