పల్నాడు జిల్లాను అక్షరాస్యతలో అగ్రస్థానంలో నిలబెట్టేందుకు అన్ని శాఖలు సమిష్టిగా కృషి చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి నారదముని పిలుపునిచ్చారు. కలెక్టరేట్లో నిర్వహించిన ‘అక్షర ఆంధ్ర – ఉల్లాస్’ జిల్లా సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది జిల్లాలో 1,39,168 మంది నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చడమే లక్ష్యంగా చెప్పుకొచ్చారు.