ASR: అనంతగిరి మండలం వెంగడ పంచాయితీ డొంకపుట్టు గ్రామంలో మంగళవారం గుర్తుతెలియని వ్యక్తులు మంటలు పెట్టడంతో సివేరి కొండలరావుకు చెందిన సుమారు ఎకరం నర కాఫీ, సిల్వర్ ఓక్ తోట పూర్తిగా దగ్ధమైంది. మధ్యాహ్నం సమయంలో చెలరేగిన కార్చిచ్చుతో తోట కాలి బూడిదైంది. నష్టపోయిన రైతును ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని మాజీ సర్పంచ్, గ్రామస్తులు డిమాండ్ చేశారు.