AP: మద్యం కుంభకోణంలో ఈడీ విచారణకు పూర్తిగా సహకరిస్తున్నామని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి తెలిపారు.ఈడీ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు తాము సంపాదించిన ఆస్తుల వివరాలన్నీ ఈడీకి ఇచ్చామన్నారు. తమ కుటుంబం సంపాదించిన ప్రతి రూపాయీ కష్టార్జితమే తప్ప అక్రమంగా సంపాదించింది కాదని స్పష్టం చేశారు.