AP: ఆంధ్రా ప్రీమియర్ లీగ్(T20) 5వ సీజన్ జూన్ 9న ప్రారంభం కానుంది. వైజాగ్, కడప, మంగళగిరిలో 32 మ్యాచులు జరగనున్నాయి. జూన్ 9-14 వరకు విశాఖలో, జూన్ 17-21 వరకు కడపలో, 24 నుంచి 30 వరకు మంగళగిరిలో నిర్వహించనున్నారు. 7 జట్లు పాల్గొనే ఈ టోర్నీని జియో హాట్ స్టార్లో ప్రసారం చేయనున్నారు. గత సీజన్లో మ్యాచులన్నీ విశాఖలోనే జరగగా, ఈసారి మరో రెండు వేదికలను యాడ్ చేశారు.