అన్నమయ్య: రాయచోటి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నూతన రెగ్యులర్ ప్రిన్సిపాల్‌గా డా.ఎం.మధుసూదన వర్మ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కళాశాల అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది ఆయనకు ఘన స్వాగతం పలికారు. కళాశాల అభివృద్ధి, విద్యార్థుల విద్యా ప్రమాణాల పెంపు, క్రమశిక్షణ, నాణ్యమైన విద్య అందించేందుకు అందరి సహకారంతో కృషి చేస్తానని మధుసూదన వర్మ తెలిపారు.