MBNR: మహబూబ్నగర్ కార్పొరేషన్ పరిధిలోని మూడో డివిజన్ మయూరి పార్కు ప్రాంతంలో రూ.50 లక్షల మైనార్టీ సంక్షేమ నిధులతో నూతనంగా నిర్మించిన ఈద్గా ప్రహరీ గోడను ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేయర్ గుమ్మాల మమత పాల్గొన్నారు.