KMM: అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని సీపీఎం తిరుమలాయపాలెం మండల కార్యదర్శి కొమ్ము శ్రీను డిమాండ్ చేశారు. ఎంపికలో రాజకీయ జోక్యాన్ని నివారించాలని మంగళవారం బచ్చోడు గ్రామంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో స్పష్టం చేశారు. ఎంపిక విషయంలో పేదలను మాత్రమే గుర్తించి మంజూరు చేయాలని కోరారు.