AP: రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం ‘ఫార్మ్ టు హోమ్’ విధానం తీసుకొస్తామని CM చంద్రబాబు తెలిపారు. వ్యవసాయ అనుబంధ రంగాలపై ఆయన సమీక్ష నిర్వహించారు. యడవోలు దగ్గర కోకో సిటీ ఏర్పాటు, పులివెందులలో ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ పూర్తికి నిధులు, కొత్త ఆక్వా కనెక్షన్లకూ విద్యుడ్ సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించారు. 200 మెకనైజ్డ్ బోట్ల కొనుగోలుకు చంద్రబాబు ఆమోదం తెలిపారు.