NDL: ప్రస్తుతం మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వాతావరణ అనుకూలత వ్యవసాయాన్ని చేపట్టాలని ఆచార్య ఎన్జీరంగా విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త డాక్టర్ సహదేవరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం గోస్పాడు మండలం యాలూరులో పంట వైవిధ్యంపై రైతు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఏక పంట సాగు కాకుండా పంటల వైవిధ్యత పాటించినట్లైతే ఎక్కువ దిగుబడి వస్తుందన్నారు.