‘డాన్ 3’ మూవీ నుంచి వైదొలగడంతో హీరో రణ్వీర్ సింగ్‌పై ‘FWICE’ మూడేళ్లపాటు బ్యాన్ విధించినట్టు వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో FWICE చీఫ్ అడ్వైజర్ అశోక్ పండిట్ వివరణ ఇచ్చాడు. అది అధికారిక బ్యాన్ కాదని స్పష్టం చేశాడు. నటులపై నిషేధం విధించే అధికారం తమకు లేదని చెప్పాడు. సమస్యకు పరిష్కారం లభించే వరకూ ఆయనతో కలిసి పనిచేయొద్దని FWICE సభ్యులను ఆదేశించామని తెలిపాడు.