BDK: పాల్వంచ మండలంలోని బసవతారక కాలనీ ఆధార్ కేంద్రం రెండు నెలలుగా మూతపడటంతో గ్రామీణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆధార్ అప్డేట్లు, పేరు మార్పులు, బయోమెట్రిక్ సేవల కోసం ప్రజలు టౌన్ కేంద్రాలకు వెళ్లాల్సి వస్తోంది. అడ్మిషన్ల సీజన్లో రద్దీ మరింత పెరగడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారు.