KRNL: ఆదోనిలో వైసీపీ ఆధ్వర్యంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమంలో భాగంగా బూత్ లెవల్ ఏజెంట్ల సమావేశం ఘనంగా నిర్వహించారు. యువ నాయకులు జయం మనోజ్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు చంద్రకాంత్ రెడ్డి పార్టీ బలోపేతం, ఓటరు జాబితా సవరణపై దిశానిర్దేశం చేశారు. బూత్ స్థాయి కమిటీల సమన్వయంతో ప్రజల్లోకి పార్టీ సిద్ధాంతాలను తీసుకెళ్లాలని సూచించారు.