PDPL: ధర్మారం మండల కేంద్రంలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపుకు మంగళవారం కాంగ్రెస్ నిరసన చేపట్టారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌పై మండిపడ్డారు. ప్రజల మధ్య ఉంటూ సేవ చేస్తున్న తనపై వ్యక్తిగత విమర్శలు చేయొద్దని హెచ్చరించారు. బీఆర్ఎస్ హయాంలో సంక్షేమాన్ని విస్మరించారన్నారు. ప్రభుత్వ భూములను పేదలకు పంపిణీ చేస్తామన్నారు.