IPL 2026లో కీలక సమరానికి RCB, GT జట్లు సిద్ధమయ్యాయి. వరుసగా రెండోసారి IPL విజేతగా నిలవాలని డిఫెండింగ్ ఛాంపియన్ RCB భావిస్తోంది. మరోవైపు బలమైన బౌలింగ్ దళం ఉన్న గుజరాత్ కూడా క్వాలిఫయర్-1లో విజయం సాధించాలని చూస్తోంది. లీగ్ దశలో రెండు జట్లూ 18 పాయింట్లతో నిలిచినా మెరుగైన రన్‌రేట్‌తో RCB అగ్రస్థానం సాధించింది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్‌కు వెళ్తుంది.