AP: నిధుల దుర్వినియోగ ఆరోపణలు ఎదుర్కొంటున్న IPS అధికారి ఎన్.సంజయ్ సస్పెన్షన్ గడువును ప్రభుత్వం పొడిగించింది. ఫైర్ సర్వీసెస్ డీజీగా ఈయన ఉన్నప్పుడు వచ్చిన ఆరోపణలపై ACB క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. సాక్షుల విచారణ, ఫోరెన్సిక్ నివేదికలు రానందున దర్యాప్తు పూర్తికాలేదు. దీంతో రివ్యూ కమిటీ సిఫార్సు మేరకు ఈ ఏడాది NOV 22 వరకు సస్పెన్షన్ గడువును ప్రభుత్వం పొడిగించింది.