WGL: నర్సంపేట పట్టణ సిటిజన్ క్లబ్లో మున్సిపల్ ఛైర్పర్సన్ పెండెం శ్రీలక్ష్మీ రామానంద్ ఆధ్వర్యంలో పీఎం సూర్య ఘర్ యోజనపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఇంటి పైకప్పులపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకుంటే 3 కిలోవాట్ల వరకు రూ.78 వేల వరకు సబ్సిడీ లభిస్తుందని టీజీ రెడ్కో డీఈ గంధం రాజేందర్ వివరించారు. దీని వల్ల విద్యుత్ ఆదా కలుగుతుందని ఛైర్మన్ అన్నారు.