AP: తూర్పు గోదావరి జిల్లా కొత్తపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి ఓ ఫ్యాక్టరీ గోడను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందగా, మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మృతులు లక్కీ, వివేక్, పద్మ, ఏడాది చిన్నారిగా గుర్తించారు. మారేడుమిల్లి విహారయాత్రకు వెళ్లి వస్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.